calender_icon.png 18 July, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

18-07-2025 06:01:42 PM

బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సంస్థాన్ నారాయణపురం మండల శాఖ అధ్యక్షులు సుర్వి రాజుగౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక  సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మండల పరిధిలోని జెడ్పిటిసి,13 ఎంపీటీసీ లతో పాటుగా అన్ని గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులని గెలిపించుకునే దిశగా పార్టీ కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.