15-10-2025 08:07:23 PM
అఖిలపక్షం, ప్రజా సంఘాల డిమాండ్
తాండూరు,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వివిధ రాజకీయ పార్టీల అఖిలపక్షం, బీసీ సంక్షేమ సంఘం, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బుధవారం తాండూర్ పట్టణంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, టీజీఎస్, ప్రజా సంఘాల నాయకులు, బిసి మేధావుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈనెల 18 వ తారీఖున జరిగే బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు గాను తాండూరు బంద్ ను విజయవంతం చేయాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.