15-10-2025 08:09:31 PM
అర్మూర్ (విజయక్రాంతి): అర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాల నందు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. రోటరీ క్లబ్ కార్యదర్శి ఖాందేశ్ సత్యం మాట్లాడుతూ భారతదేశపు క్షిపణి, అణు కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారని అన్నారు. 2002 నుండి 2007 వరకు రాష్ట్రపతిగా పనిచేసి దేశ ఔన్నత్యాన్ని చాటారని కొనియాడారు. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండని కలాం చెప్పేవారని గుర్తు చేశారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు రజనిష్ కిరాడ్, రాస ఆనంద్, లక్ష్మీ నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తుమ్మల లక్ష్మణ్, సునీత, మహేందర్, ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు.