తహసీల్దార్ కార్యాలయానికి తాళం
అద్దె ఇవ్వడం లేదని తాళం వేసిన యజమాని
మెదక్, జూన్ 19(విజయక్రాంతి): ఏడాది కాలంగా అద్దె చెల్లించకపోవడం తో తహసీల్దార్ కార్యాలయానికి యజమాని తాళం వేశాడు. వివరాలిలా ఉన్నా యి.. మెదక్ జిల్లా నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. అయితే, ఏడాది నుంచి అద్దె చెల్లించడం లేదని భవన యజమాని బుధవారం కార్యాలయానికి తాళం వేశాడు. దీంతో ఉద్యోగులంతా ఆరు బయటే నిలబడాల్సి వచ్చింది. అద్దె విషయమై పలుమార్లు తహసీల్దార్, అదనపు కలెక్టర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని యజమాని ఆరోపించారు. విధులకు ఆటంకం కలుగు తుందని, అద్దె డబ్బులు త్వరలోనే అందే లా చేస్తామని తహసీల్దార్ సురేశ్ కుమా ర్ హామీ ఇవ్వడంతో కార్యాలయం తాళం తీశారు. కాగా, ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాకపోవడం వల్లనే అద్దె చెల్లింపునకు ఆలస్యమైందని తహసీల్దార్ చెప్పారు. ఎన్నికల కారణంగా మెయింటనెన్స్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలోనే అద్దె చెల్లిస్తామని తెలిపారు.






