29-04-2025 12:00:00 AM
రాజాపూర్ ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలం కావస్తున్నా అద్దె భవనాల్లో నీ ప్రభుత్వ కార్యాలయాలు కొనసా గుతున్నాయి. ఇంటి అద్దె సక్రమంగా ఇవ్వకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటి ఓనర్స్ తాళాలు వేయడం రాజాపూర్ మం డలంలో పరిపాటిగా మారింది. తాజాగా సోమవారం తాహసీల్దార్ కార్యాలయం ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు శ్రీనివాసరావు అతని భార్య తసిల్దార్ తాళం వేసి అధికారులను అడ్డుకున్నారు.
గత రెండు సంవత్సరాల నుండి ఇంటి అద్దె చెల్లించక పోవడంతో దాదాపు అద్దె రూ. 2.50 లక్షలు పేరుకుపోయింది. ఇంటి రుణా లు కట్టలేక అవస్థలు పడుతున్నామని వారు మండిపడ్డారు.ఇంటి అద్దె నెలకు రూ.14 వేల అద్దె అని తెలిపారు .అద్దె డబ్బులు చెల్లించకపోతే ఇంటి తాళం తీయబోమని బిస్మించుక కూర్చున్నారు. తాసిల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఎస్త్స్ర శివానంద్, స్థానిక కాంగ్రెస్ నాయకులు కలుగజేసుకొని ఇంటి అద్దె ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అతను తాహసీల్దార్ కార్యాలయానికి తాళం తీశారు.