24-06-2025 11:32:39 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్(Asifabad Municipal Commissioner)గా గజానంద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 56 మంది మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వారికి గ్రేడ్ - 3 మున్సిపల్ కమిషనర్ గా పదోన్నతులు కల్పిస్తూ పలు ప్రాంతాలకు బదిలీ చేశారు. అందులో భాగంగా గజానంద్ ను ఆసిఫాబాద్ కు కేటాయించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న భుజంగరావు ఆసిఫాబాద్ ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ ఇన్నాళ్లు కొనసాగారు.