28న లోక్ అదాలత్..
11-03-2026 05:08 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టులో ఈనెల 28న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి న్యాయ మూర్తి జై ముఖేష్ తెలిపారు. బుధవారం బెల్లంపల్లి మేజిస్ట్రేట్ సమక్షంలో లోక్ అదాలత్ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ముఖేష్ మాట్లాడారు. బెల్లంపల్లి కోర్టులో పెండింగ్ కేసుల పరిష్కారానికిలోక్ అదాలత్ సముచితమైన మార్గమన్నారు. పెండింగ్, కాంప్రమైజ్, అడ్మిసిబుల్ కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.




