17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

యూట్యూబర్ అన్వేష్‌పై లుక్ అవుట్ నోటీసులు

26-02-2026 12:00 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చు కున్న యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)కు మరో బిగ్షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు అతనిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల అన్వేష్ అకౌంట్ను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అతడు తనకు ఇంకా రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూ ట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని వీడియో విడుదల చేశారు.

అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ వీడియోను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీ సులు... అన్వేష్కు సంబంధించిన మరో ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో పాటు యూ ట్యూబ్ ఛానళ్లను మూసివేయాలని సంబంధిత సంస్థల కు లేఖలు రాయనున్నారు. ఇప్పటికే హిం దూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అన్వ్పే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.