అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
శామీర్ పేట్, ఫిబ్రవరి 25( విజయక్రాంతి): పేదలకు ఇళ్లు కట్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. విడతల వారీగా నిధులు కేటాయిస్తూ ఇళ్లులేని వారికి సొంతింటి కల నెరవేరస్తుందాని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం అలియాబాద్ మున్సిపాలిటీ లాల్ గాడిమలక్ పేట్ లోని మ్యాకల మాధవి మహేష్ నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ..... కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ది, సంక్షేమ పథకాలను నిరుపేదలకు, అర్హులందరికీ అందజేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ఒక నిరంతర ప్రక్రియ అని ఇంకా అర్హులైన వారు ఉన్నట్లయితే వారందరికి దశల వారిగా ఇళ్లు మంజూరు చేయిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ కంఠం శిరీష, సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్, ఆర్టిఏ మెంబర్ జైపాల్ రెడ్డి, ఎ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు మౌనిక బాబు, ముద్దం సుధాకర్ రెడ్డి , జశ్వంత్ రెడ్డి , ఎఎంసి డైరక్టర్ బిక్షపతి, మాజి సర్పంచ్ మల్లేష్, మాజి ఎంపిటిసి అశోక్ , అలియాబాద్ మున్సిపల్ అద్యక్షుడు తుంకి రమేష్, ఉపాద్యక్షుడు చాట్లపల్లి నర్సింగరావు, యూత్ కాంగ్రెస్ ఉపాద్యక్షులు రాము, ఇందిరమ్మ ఇంటి కమిటి సభ్యులు, మాజి సర్పంచ్ కమఠం కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నవీన్ రెడ్డి , సతీష్, యాదగిరి, దినేష్, అర్జున్, జ్యోతి మల్లేష్, సాయికుమార్, శ్రీనివాస్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.




