17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

హెల్త్ కార్డ్స్‌పై ఉపాధ్యాయుల, ఉద్యోగుల సందేహాలు ప్రభుత్వం నివృత్తి చేయాలి

26-02-2026 12:00 AM

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

సికింద్రాబాద్,ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యా యులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ఉపాధ్యాయఎమ్మెల్సీ మల్క కొమ రయ్య అన్నారు. ఈ సందర్భంగా  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లా డుతూ పిఆర్సిఅమలు చేసిన తర్వాతనే ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ స్వీకరించాలి తెలియజేస్తూ, అప్పటివరకు ప్రభుత్వమే భరించాలి అన్నారు.

ఉద్యోగ ఉపాధ్యాయులకు  క్యాష్ లెస్ చికిత్స విధానంపై ప్రభు త్వం మరింత స్పష్టతివ్వాలన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. ఫిబ్రవరి 23న  క్యాబినెట్  ఆమోదించిన డిజిటల్ హెల్త్ కారడ్స్ పాలసీపై స్పందించిన ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతి స్తున్నామని  తెలియజేస్తూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా నెలసరి వేతనాలను నేరుగా చెల్లించాలి, అలాగే కేజీ బీవీ, ఎస్‌ఎస్‌ఎ, యుఆర్‌ఎస్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కూడా హెల్త్ కారడ్స్ మంజూరు చేస్తూ, కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వమే చెల్లించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కోమరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.