లూట్ ఈస్ట్ పాలసీ

18-04-2024 02:29:20 AM

కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శల పర్వం

బీజేపీ వచ్చాక అమల్లోకి యాక్ట్ ఈస్ట్ పాలసీ

l ఈశాన్యం అభివృద్ధికి బీజేపీ కృషి

l బీజేపీ హయాంలో త్రిపురలో గొప్ప మార్పులు 

l ఈశాన్య రాష్ట్రాలను అవినీతిపరుల అడ్డాగా మార్చిన కాంగ్రెస్

అగర్తలా, ఏప్రిల్ 7: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ ‘లూట్ ఈస్ట్’ పాలసీని అవలంబిస్తూ.. దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిం దని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. త్రిపురలోని అగర్తలాలో మంగళవారం ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. బీజేపీ హయాంలో త్రిపుర ఎనలేని మార్పులను చూసిందని గుర్తుచేశారు. ఈశాన్య రాష్ట్రాలకు కాంగ్రెస్ న్యాయం చేయకపోగా.. అవినీతిపరులకు అడ్డాగా మార్చిందంటూ దుయ్యబట్టారు. కమ్యూనిస్టు నాయకులు త్రిపుర అవకాశాలు తుడిచిపెట్టారని మండిపడ్డారు. బీజేపీ మాత్రం ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు పాటుపడుతోందని వివరించారు.

దేశంలోని పేదల కోసం 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని బీజేపీ ప్రభు త్వం నిర్ణయం తీసుకుందని, ఈ పథకం ద్వారా త్రిపుర ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు అనుసంధానం పెంచడంపై తమ ప్రభు త్వం దృష్టి సారిస్తోందని చెప్పారు. రహదారుల నిర్మాణానికి తమ ప్రభుత్వం రూ.3 వేల కో ట్లు వెచ్చించినట్టు గుర్తుచేశారు. బంగ్లాదేశ్‌ను దక్షిణ త్రిపుర సబ్‌రూమ్ సబ్‌డివిజన్‌కు కలిపేంపేం దుకు ఫేని బ్రిడ్జిని నిర్మించామన్నారు. రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణ జరుగుతోందన్నారు.