10 April, 2026 | 7:26 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

దుర్గామాత మండపం వద్ద స్వయంభుగా వెలసిన గణనాథుడు

02-10-2025 12:09 AM

మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలో బయటపడ్డ విగ్రహం

ఆదిలాబాద్, అక్టోబర్ ౧ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవా ల సందర్భంగా అద్భుత ఘటన చోటుచేసుకుంది. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో దుర్గా మాత మండపం వద్ద స్వయంభూగా వియకుని విగ్రహం వెలిసింది. బుధవారం దుర్గా దేవి మండపం వద్ద ఆదిలాబాద్ మున్సిపల్ కమిషన్ రాజుతో పాటు కాలనీవాసులు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతుండగా ఒక్కసారిగా వినాయకుని విగ్రహం బయటపడింది. దీంతో కమిషనర్‌తో పాటు కాలనీవాసులు ఆశ్చర్యానికి గురై ఆ వినాయకుని విగ్రహాన్నీ అక్కడే ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మ మండపం వద్ద వినాయకుడి విగ్రహం బైట పడటం అంత దైవ సంకల్పమని కాలనీవాసులు పేర్కొన్నారు.