02-10-2025 12:08:56 AM
మహబూబాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పోలీసు సాయుధ దళ కార్యాలయంలో దసరా పండుగను పురస్కరించుకుని ఆయుధపూజ, వాహన పూజ నిర్వహించారు. ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, విజయ ప్రతాప్, టౌన్ డిఎస్పి తిరుపతిరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, రూరల్ సీఐ సర్వయ్య, ఆర్ ఐ లు అనిల్, సోములు, భాస్కర్, నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.