calender_icon.png 18 August, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొదమ సింగమంత ఠీవిగా శ్రీకృష్ణా, రావయ్యా!

07-01-2025 12:00:00 AM

వర్షాకాలంలో (మారి) కొండగుహలో (మలైముఝంగిల్) ఆడసిం హాన్ని కౌగిలించుకుని పడుకొని ఉన్న (మన్నికిడందు) నిదురిస్తున్న (ఉఱంగుమ్) శౌర్యోపే తమైన సింహం (శీరియ శింగమ్) మేలుకుని లేచి (అఱివిట్రు) నిప్పులు కురుస్తూన్న కను లు తెరిచి (తీవిఝుత్తు) పరిమళించే జూలును (వేరిమయిర్) నిక్కబొడిచి (నిగిడ్చి) (పొంగ) అన్ని దిశలలో( ఎప్పాడుమ్) కదలి (పేర్ న్దు) ఒడలు విరచి (ఉదఱి) శరీరాన్ని సాగదీసి (మూరి నిమిర్ న్దు) గర్జించి (ముఝంగి) వెలుపలకు (పురప్పట్టు) వస్తున్నట్టుగా (పోదరుమాపోలే) కానుగ పూవువంటి మేను ఛా యగలవాడా (నీ పూవైప్పూవణ్ణా) నీ నివాస భవనం నుంచి (ఉన్ కోయిల్ నిన్ఱు) ఇక్కడికి వేంచేసి (ఇంగనే పోందరుళి) మనోహరమైన (కోప్పుడైయ) శ్రేష్ఠమైన (శీరియ) సింహానంపైన ఆసీనుడవై (శింగాసనత్తిరిందు) మేము వచ్చిన (యామ్ వంద) పనిని (కారియమ్) అనుగ్రహించు (ఆరాయ్ న్దు అరుళు).

కృష్ణ సింహచైతన్య విజృంభణ

శ్రీకృష్ణుడు యదుసింహుడు. వర్షాకాలం లో కొండగుహలో తన జతయైన ఆడసింహా న్ని ఆలింగనం చేసుకుని నిద్రిస్తున్న వీరసిం హం మేలుకుని నిప్పులు కురిసే కన్నులు తెరి చి, పరిమళం వెదజల్లే జూలును నిగిడ్చి ఒడ లు విరిచి అన్నివైపులా ఒక్కసారి కదిల్చి గర్జిం చి వెలుపలికి నడచిన రీతి, అవిసె పూవువన్నెగల శ్రీకృష్ణా, నీ అంతఃపురం నుంచి ఇక్కడికి వచ్చి ఈ లోకోత్తరమైన సింహాసనాన్ని అధిరోహించు, మా వచ్చిన పని విచారించి అను గ్రహించమని గోపికలు కోరుతున్నారు. నీళాదేవిని ఆలింగనం చేసుకుని నిద్రించిన శ్రీకృ ష్ణ సింహం మేలుకుంటున్న రీతిని వర్ణించడం ఇది.

సింహం పర్వతగుహలో ఉన్నట్టు నీళాదే వి ఉత్తుంగ స్తనగిరిలో శ్రీకృష్ణుడు ఉన్నాడట. శయన స్థితినుంచి చైతన్యదశలోకి విజృంభిస్తున్న శ్రీకృష్ణ నరసింహాన్ని చూడాలని అ నుకుంటున్నారు. నిన్నటిదాకా తామర పూవులనుకున్న కళ్ళు ఈవేళ నిప్పులు కురిపిస్తున్నా యి. ఆశ్రితుల శత్రువులపై పరమాత్ముడు క న్నెర్ర చేయడమూ గోపికలకు ఇష్టమే. ఆ నరసింహుని ఉగ్రనేత్రాలనుకూడా చూడగలగా లంటే ఇంకే కోరిక లేని వారైతేనే సాధ్యమవుతుంది.

మెలకువ రాగానే కళ్లు తెరిచి, ఒళ్లు విరిచి, జూలు విదిలించి, శత్రు హృదయాల్ని భేదించే విధంగా మేఘం వలె గర్జించి, గుహనుంచి బయటకు వచ్చే సింహం వలె రావ య్యా యాదవసింహమా వీర నరసింహమా అంటున్నారు గోపికలు. ఆ పరమాత్మ వేదగుహలలో ప్రకాశిస్తాడట. ఉన్నది తానొక్కడే. తనకన్న వేరుగల వస్తువులేదు. స్థూలనామ రూపకమైన ప్రపంచమై వెలికి రాకముందు వేదగుహలో పండుకుంటాడట.

గుహ అంటే గ్రహించడానికి శక్యం కానిది. ధర్మతత్వం గు హలో నిక్షిప్తమై ఉంది. భరద్వాజునకు వేదా లు పర్వతాలై కనిపిస్తాయి. అన్నమయ్యకు తిరుమల వేదాలై శిలలై వెలసిన కొండవలె కనిపిస్తుంది. వర్షకాలంలో అసలు కదలికే లే నట్టు సింహం నిద్రిస్తుంది. వేదమూ ఉన్నదా లేదా అన్నట్టు ఉంటుంది. పరమాత్మ సృష్టికి ముందు ప్రళయకాలంలో సర్వజగత్తును తానే భక్షిస్తాడు హింసిస్తాడు కనుక సింహం. 

సింహాసనప్పాట్టు

శయ్యాగారంలో పాన్పుపై పడుకుని మా తో మాట్లాడడం కాదు. కదలివచ్చి సభామందిరంలో ఈ మహత్తర సింహాసనా రూఢుడవై మాకు కనిపించు. మా మాట విను దయదలచు అని వేడుకుంటున్న ఈ పాశురాన్ని సిం హాసనప్పాట్టు అంటారు.

రామానుజ సంబంధీకులైన గోపికలను నిరాదరించరాదని వారి ని కరుణించాలని పరమాత్ముడు అనుకున్నా డు. కనుక వారిని లోనికి రమ్మన్నాడు. అంతఃపురంలోని అంతరంగ వాక్యాలకన్నా సింహా సనం మీద కూర్చున్నప్పుడు పలికే బహిరంగ వాక్యాలే శ్రేష్ఠమని గోపికలు అనుకున్నారు.