హైవేపై లారీలో మంటలు, తప్పిన ప్రమాదం
11-10-2024 01:52 PM
హైదరాబాద్: నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని ఎన్‌హెచ్-65పై సిమెంట్ బస్తాలతో వేగంగా వెళ్తున్న లారీ శుక్రవారం డివైడర్‌ను ఢీకొని మంటలు చెలరేగాయి. లారీ డీజిల్ ట్యాంక్ పగిలి వాహనం పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ బయటకు దూకి క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, అగ్ని ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. లారీ సిమెంట్ బస్తాల లోడుతో కోదాడలోని మల్లంపేట వైపు వెళుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






