ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
11-10-2024 01:56 PM
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు హెచ్చరించడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులకు ఈమెయిల్ రావడంతో కొన్ని గంటలపాటు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. కోయంబత్తూరు నుంచి వస్తున్న విమానం హైదరాబాద్ మీదుగా చెన్నై వెళ్లింది. ప్రయాణీకులను దించేశారు. అధికారులు ఆరు గంటల పాటు విమానంలో శోధించి, ఆల్-క్లియర్‌గా ప్రకటించారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. అనంతరం ప్రయాణికులతో విమానం చెన్నైకి బయలుదేరింది. ఇప్పుడు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో విమానాల్లో వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే.






