23 April, 2026 | 9:55 PM

బైక్‌ను ఢీకొట్టిన లారీ..

09-12-2024 01:23 AM

ఇద్దరు దుర్మరణం

అశ్వారావుపేట, డిసెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పరిధిలోని తల్లాడ జాతీయ రహదారిపై ఆదివారం ఉద యం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. అశ్వారావుపేట నుంచి నారంవాడిగూడెం కాల నీకి బైక్‌పై ముగ్గురు వెళ్తుండగా సత్తుపల్లి వైపు నుంచి అశ్వారావుపేటకు వెళ్తున్న లారీ అతివేగంగా వస్తూ మరో లారీని ఓవర్‌టేక్ చేయబోయి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీలోని జిలుగుమిల్లు మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన బత్తుల మనోజ్(28), అశ్వారావుపేట మండలం పాపిడీగూడెంకు చెందిన బద్దె వెంకటేశ్వరరావు (58) మృతి చెందారు. అంకంపాలెంకు చెందిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.