23 April, 2026 | 11:21 PM

బావిలో దూకి తల్లీకొడుకు ఆత్మహత్య

09-12-2024 01:26 AM

పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న కూతురు

చేవెళ్ల, డిసెంబర్ 8: కొడుకును బావిలో తోసేసి తాను ఆత్మహత్య చేసుకుందో తల్లి. గమనించిన కూతురు పారిపోయి ప్రాణా లు దక్కించుకుంది. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం గేటు వనం పల్లికి చెందిన గుల్ల శేఖర్, అరుంధతి(32) దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కొడుకు గల్ల రుత్విక్ (7), కూతురు ప్రజ్వల ఉన్నారు. శనివారం సాయంత్రం అరుంధ కొడుకు, కూతురును తీసుకొని గ్రామంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది.

ఎందుకు వచ్చామని కూతురు అడగడంతో చనిపోతున్నామని చెప్పింది. దీంతో కూతురు ఊర్లోకి పరిగెత్తింది. తర్వాత కొడుకును బావిలో తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాలను బయటకి తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకు న్న ఎమ్మెల్యే యాదయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థికసాయం అందజేశారు.