3 September, 2026 | 7:36 AM

రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి: బీజేపీ

31-08-2025 | 11:54pm

ఖమ్మం,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఖమ్మం అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలో బీహార్ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ఇండియా కూటమి నాయకులు,  ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని దుర్భాషలాడిన వారిపై చట్ట పరమైన చర్య తీసుకొని రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేశారు. అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేయటం జరిగింది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులని అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొనడం జరిగింది.