2 May, 2026 | 9:16 AM

కాలువలోకి దూసుకెళ్లిన లారీ..

29-06-2025 07:12 PM

తృటిలో తప్పిన పెను ప్రమాదం..

లారీ డ్రైవర్ కు గాయాలు..

వైరా (విజయక్రాంతి): రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ముందుగా వెళుతున్న లారీ అదుపుతప్పి పోయి రిజర్వాయర్ ప్రధాన కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన సోమవారం గ్రామం సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలు కాగా, తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రి నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న రెండు లారీలు సోమవారం గ్రామం సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద గల రిజర్వాయర్ ప్రధాన కాలువ సమీపంలో ఒకదాని వెనుక మరో లారీ ఢీకొనటంతో ముందుగా వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకుపోయింది. సంఘటన వివరాలు పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా హుటాహుటిన అక్కడకు చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.