9 April, 2026 | 12:07 PM

కాపాడమని వెళ్తే.. కన్నెర్ర చేశారు

07-05-2024 01:48 AM

తమను పోలీసులు విడదీశారని నూతన దంపతుల ఆరోపణ

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి వినూత్న నిరసన

జనగామ, మే 6 (విజయక్రాంతి): ప్రేమ పెళ్లి చేసుకున్న తమను రక్షించాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే విడదీసే ప్రయత్నం చేశారని నూతన దంపతులు ఆరోపించారు. తమను కాపాడాలని కోరు తూ జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఆ జంట వినతిపత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపింది. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లాలోని పాలకుర్తికి చెందిన అఖిల్, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కీర్తి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ ఇటీవల వివాహం చేసుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పాలకుర్తి పోలీసులను కోరారు. దీంతో పోలీసులు అమ్మాయి కుటుంబీకులను పిలిపించి మాట్లాడారు. వారు మాట్లాడి వెళ్లిపోగానే పోలీసులు అమ్మాయిని విడిచిపెట్టాలని అఖిల్‌ను బెదిరించారని ఆరోపించారు. బల వంతంగా అమ్మాయి మెడలో నుంచి తాళి, కాళ్లకు మెట్టెలు తీసివేయించారని చెప్పారు.  వరంగల్ సీపీని కలిసినా ఫలితం దక్కలేదని, అందుకే అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చామని వివరించారు.