17 March, 2026 | 1:23 PM

Breaking News

కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •  

ఇంతటి పాజిటివ్ టాక్ రావడం లక్కీ

03-11-2024 12:00 AM

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. మీనాక్షి చౌదరి కథానాయిక. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో అంతటి పాజిటివ్ టాక్ వచ్చింది. థాంక్స్ అనేది చాలా చిన్న మాట. సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలుగుతోంది.

ఇది మా అదృష్టం’ అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘మలయాళం ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాలా చూడటంలేదు. సొంత సినిమాగానే భావిస్తున్నారు’ అన్నారు. నటుడు రాజ్‌కుమార్ కశిరెడ్డి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.