వానలే వానలు
- జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు
- పారుతున్న వాగులు, వంకలు
- చెరువుల్లోకి చేరుతున్న వరద
- పలు మండలాల్లో అధిక వర్షపాతం నమోదు
కారాబాద్, ఆగస్టు- 5( విజయ క్రాంతి ): జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సీజన్ మొదట్లో ఎలినో ప్రభా వంతో తీవ్ర వర్షాభావం కనిపించడం కనిపి ంచింది. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ప ంటలకు జీవం పోసినట్లు అయింది. ఈ సీ జన్లో ఇదే అత్యధిక వర్షపాతం. జిల్లాలోని ఒ కటి రెండు చోట్ల భారీగా మిగతా చోట్ల సా ధన వర్షపాతం నమోదయింది. రైతన్నకు కా స్త ఉపశమనం లభించింది.
వాగులు వంక లు పారుతూ చెరువుల్లోకి నీరు చేరుతుంది. గడిచిన వారం రోజుల్లో మోమిన్ పేట్ లో అత్యధికంగా 45 మిల్లీమీటర్లు, నవాబుపేటలో 31 మిల్లీమీటర్లు, మర్పల్లి లో 26.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. పలు కాలనీలు నీటి గుంటలను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ బురదగా మారాయి.
ఆనందంలో రైతులు..
వానాకాలం ప్రారంభం నుండి ఇప్పటివరకు పంటలకు సరిగా వర్షం పడలేదు. అప్పుడప్పుడు కురిసిన పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. సెలకలు ఇసుక పొలాల్లో మొక్కజొన్న తదితర విత్తనాలు సగం మొలకెత్తి మిగతావి ఎండిపోయాయి. ప్రస్తుత వర్షాలు వరి నాట్లు వేసుకునే రైతులకు మేలు చేయునున్నాయి. వానలు ఇలాగే కొనసాగితే బోరు బావులు, చెరువుల్లో నీటిమట్టం పెరిగి నాట్లు ఊపoదుకునే అవకా శం ఉంది. ప్రస్తుతం పత్తి,జొన్న, మొక్కజొ న్న, కంది, పెసలు, కూరగాయలు, పసుపు తదితర పంటలకు జీవం పోసినట్టయింది.
పంటలు పచ్చగా ఉండటంతో రైతుల్లో ఆనందం కనిపిస్తుంది. ఇప్పటివరకు జిల్లాలోని నాలుగు మండలాల్లో అత్యధిక వర్ష పాతం నమోదు కాగా మూడు మండలాల్లో సాధారణం, మరో 13 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. రెండు మూడు మండలాల్లో మినహా మిగతా అన్నిచోట్ల సాధారణ వర్షపాతానికి చేరువయ్యాయి. మొత్తంగా చూస్తే జిల్లాలో ఇంకా 25 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం కనిపిస్తుంది.
అప్రమత్తమైన అధికారులు..
మంగళవారం అర్ధరాత్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. గత అనుభవాల నేపథ్యంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. వాగులు వంకల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయి అధికారులను అలెర్ట్ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాఠశాలల హెచ్‌ఎం లతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. ఇది లా ఉండగా ఎరువుల కోసం రైతులు పిఎసిఎస్ కేంద్రాలు, ఫెర్టిలైజర్ షాప్ లో బాట పడుతున్నారు. ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.






