పొంచి ఉన్న ప్రమాదం
గుంజపడుగులో ప్రమాదకరమైన గుంత
మంథని, మార్చి25(విజయక్రాంతి): మంథని మండలం గుంజపడుగు గ్రామం లో ప్రధాన రహదారి పక్కన పెద్ద గుంత ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. గుంజపడుగు బస్టాండ్ నుండి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి పై ఇంత పెద్ద గుంత ఏర్పడిన సంబంధిత అధికారులు, పాలకు లు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు వి చారం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి గుం డా రోజు వందలాది వాహనాలు పోతూ వస్తూ ఉంటాయి. పక్కనే ఒక ప్రైవేటు పాఠశాల వాహనాలు సైతం పిల్లలతో వెళ్తూ ఉంటాయి.
వాహనదారులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఘోరమైన ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. గుంజపడుగు నుండి ఉప్పట్ల గ్రామానికి వెళ్లే వాహనదారులకు కూడా ఈ ప్రమాదకరమైన గుంత సంకటంగా మారింది. బస్టాండ్ ప్రాంతం నుండి డ్రైనేజీని యూటర్న్ ద్వారా ఇటువైపు మరలచడంతో ఈ గుంట ఏర్పడినట్లు గ్రామ స్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రమాదకరమైన గుంతను పూడ్చి డ్రైనేజీ ద్వారా నీరు సులభతరంగా వెళ్లడానికి ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు, ప్ర యాణికులు అధికారులను కోరుతున్నారు.




