హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు
26-03-2026 01:07 AM
మంచిర్యాల టౌన్, మార్చి 25: హజ్ యాత్రకు వెళ్ళే వారికి బుధవారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్, ఆర్ ఎం ఓ డాక్టర్ శ్రీధర్ వైద్య పరీక్షలు నిర్వహించారు.
హజ్ యాత్రకు వెళ్లే 17 మందికి అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముస్తాఫా, డాక్టర్ తాజ్మీయ, డిపిఓ ప్రశాంతి, డీపీఆర్వో బుక్క వెంకటేశ్వర్, జిల్లా వ్యాక్సినేషన్ మేనేజర్ అఖిల్ పాషా, సిహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్ రే టెక్నీషియన్లు, కోఆర్డినేటర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.




