11-05-2025 10:19:00 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం విప్లవాల ముద్దుబిడ్డ మారోజు వీరన్న మే 16న 26 వర్ధంతి స్థూపం వద్ద జరిగే ఈ కార్యక్రమానికి బీసీ సంఘం జేఏసీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రజా ఉద్యమాల నేత చెరుకు సుధాకర్ , బీసీ జేఏసీ నాయకులు ఒట్టే జానయ్య యాదవ్, బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, బీసీ జేఏసీ చైర్మన్ సూదగాని హరి శంకర్ గౌడ్, బెల్లీ కృష్ణన్న, బీసీ జేఏసీ నాయకులు, సంగెం సూర్యారావు, తదితరులు హాజరవుతున్నారు. కావున సకాలంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు, స్నేహితులు బంధుమిత్రులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యమాల ముద్దుబిడ్డ గ్రామవాసి మట్టపల్లి సంతోష్ ప్రకటనలో తెలిపారు.