11-05-2025 10:13:14 PM
మంథని,(విజయక్రాంతి): మంథని డివిజన్ లో ఆదివారం కమాన్ పూర్, రామగిరి, మంథని మండలంలో నూతన వధూవరులను మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ళ శ్రీను బాబు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంథని పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మండపంలో రవికంటి అన్నపూర్ణ సత్యనారాయణ కూతురు సుష్మిత - నవీన్ బాబు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. మంథని పట్టణంలోని ఏసీ కన్వెన్షన్ హాల్ నందు జీవన్ - నక్షత్ర వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జన్మదిన వేడుకల్లో మంథని పట్టణ పరిధిలోని గంగాపురి కి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఎరుకల రమేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయించి శ్రీనుబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.