calender_icon.png 21 January, 2026 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సెయింట్ పాల్స్’లో మాక్‌పోల్

09-08-2024 01:04:16 AM

కరీంనగర్ సిటీ, ఆగస్టు 8 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని వావిలాలపల్లిలోగల సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో గురువారం విద్యార్థులకు మాక్‌పోల్ నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాఠశాల డైరెక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని.. ఓటుహక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా ఓటుహక్కు వినియోగం, ఎన్నికల్లో పోటీచేసేందకు అర్హతలు తదితర వాటి గురించి విద్యార్థులు.. ఉపాధ్యాయులను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లీనా ప్రియదర్శిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.