calender_icon.png 21 January, 2026 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీ పీజీఈసెట్ షెడ్యూల్ మార్పు

09-08-2024 01:13:51 AM

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): టీజీ పీజీఈసెట్ 2024 ను అధికారులు రీషెడ్యూల్ చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశామని అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 24లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను ఈనెల 25న విడుదల చేయనున్నారు. వెబ్ ఆప్షన్లను 27, 28 తేదీల్లో  నమోదు చేసుకోవాలి. 29న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 1న సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ మధ్యలో సీట్లు పొందిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. సెప్టెంబర్ 2 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.