2 August, 2026 | 12:07 AM

నకిలీ డాక్టర్ ఖరీదైన వైద్యం

28-05-2024 12:42 AM

ప్రాణాపాయస్థితిలో రోగి

చర్మవ్యాధి నివారణ నిపుణులుగా తనకుతానే ఫేమస్ 

సిద్దిపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన వైనం

సిద్దిపేట, మే 27 (విజయక్రాంతి) : డాక్టర్ అరుణ్ కుమార్ ఆర్‌ఎంపీ. ఇతడు ఎం చదివాడో ఎవరికి తెలియదు కానీ ఆర్‌ఎంపీ వైద్యుడి అవతారమెత్తడు. ఈయన రాసిన మందులు తన క్లినిక్ ఎదురుగా ఉన్న మెడికల్ షాపులో మాత్రమే లభిస్తాయి. ఒక ప్రిస్కిప్షన్‌కు కనీసం రూ. 2వేల నుంచి రూ. 5వేల బిల్ కావాల్సిందే. ఇంత ఖరిదైన వైద్యం అందించే నకిలీ డాక్టర్ చేసిన చికిత్స వికటించి ఓ వ్యక్తి ప్రాణప్రాయస్థితిలో ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన లక్ష్మణ్‌చారి చర్మ సంబధిత వ్యాధితో బాధపడుతూ దుబ్బాక మండలంలోని లచ్చపేట గ్రామంలోని తుల్జాభావని క్లినిక్‌కు వెళ్లాడు.

ఆర్‌ఎంపీ డాక్టర్ అరుణ్ కుమార్ చేసిన చికిత్సతో లక్ష్మణ్‌చారి శరీరంపై తీవ్రమైన బొబ్బలు (శరీరంపై చర్మ కమిలిపోయింది) ఏర్పాడ్డాయి. దీంతో బాధితుడు సదరు చికి త్స చేసిన వైద్యున్ని సంప్రదించాడు. తాను చేసింది తప్పుడు చికిత్స అని నిర్ధారించుకుని చేతులెత్తాశాడు. పెద్ద దవాఖానలో చూపించుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో బాధితుడు సిద్దిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపా యస్థితిలో ఉన్న చారిని మధ్యవర్తుల ద్వారా బెరాసారాలు చేసి రూ. 50వేలు నష్టపరిహారంగా ఇస్తానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం బాధితుడు లక్ష్మణ్‌చారి కడుపు, ఛాతీ, వీపు, కాళ్ల భాగాలపై చర్మం మొత్తం తీసివేయబడింది.  

ఆలస్యంగా వెలుగులోకి... 

లచ్చపేటలో నకిలీ వైద్యుడు అరుణ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. లక్ష్మణ్ చారి ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజు తన మిత్రుల ద్వారా తెలుసుకుంటూ తన చర్యలు కొనసాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. తాను ఏర్పాటు చేసుకున్న క్లినిక్‌ను తెరవడం లేదు, అక్కడున్న బోర్డు కూడా తొలిగించాడు. అయితే లక్ష్మణ్ చారితో అరుణ్‌మార్ చేసుకున్న ఒప్పందం కూడా వికటించింది. దీంతో బాధితుడి బంధువులు నకిలీ వైద్యున్ని సంప్రదించగా తనకు రాజకీయ నాయకుల సహాకారం ఉందని, మీకు నచ్చింది చేసుకొండి అంటూ వారి నుంచి తప్పించుకోవడంతో చికిత్స వికటించిన విషయం వెలుగు చూసింది. 

పర్యవేక్షణ లోపం

గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా వేలుస్తున్న ఆర్‌ఎంపీల క్లినిక్‌లపై ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నకిలీ ఆర్‌ఎంపీ వైద్యుడు అరుణ్ కుమా ర్‌పై కేసు నమోదు చేసి బాధితుడు లక్ష్మ ణ్ చారికి న్యాయం చేయాలని అతడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.