calender_icon.png 16 January, 2026 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంపీకి ఆహ్వానం

15-01-2026 12:36:24 AM

అలంపూర్, జనవరి 14: జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవిని, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ధార్మిక సలహాదారుడు గోవిందా హరిని ఆహ్వానించినట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదరాబాదులో వారిని కలిసి ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేసినట్లు చెప్పారు. ఈనెల 19 నుంచి 24 వరకు జోగులాంబ అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అదేవిధంగా వచ్చేనెల 14 నుంచి 18 వరకు బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతాయని ఈవో పేర్కొన్నారు.