3 May, 2026 | 12:48 PM

దేశం గర్వపడేలా చేసింది

27-04-2024 02:50 AM

l తెలంగాణ అభివృద్ధిలో బీఆర్‌ఎస్‌ది కీలక పాత్ర

l ఇవాళ బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం

l శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

విజయక్రాంతి, ఏప్రిల్ 26: దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాం క్షలు తెలిపారు. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి, పదేళ్ల పాలన లో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించడంలో పార్టీ కీలక భూమిక పోషించిందని చెప్పారు. దీంతో తెలంగాణ దేశం గర్వించే రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యవాదులందరికీ.. ముఖ్యం గా తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ప్రజల స్వరాష్ట్ర స్వయంపాలన ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా నిలిచిం దన్నారు.

వేలాది సంఖ్యలో పలు స్థాయి ల్లో తెలంగాణ నాయకత్వాన్ని తీర్చిదిద్ది రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, ప్రగతి పథం లో రాష్ట్రాన్ని నడిపించిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే బీఆర్‌ఎస్‌ది ప్రత్యేక స్థానమని కొనియాడారు. పార్టీ సాధించిన విజయాలతోపాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ పలు మైలురాళ్లు అధిగమించడానికి పార్టీ కార్యకర్తలే బలమైన పునాదులు వేశారని చెప్పారు. ప్రజలతో, మేధావి వర్గాలతో మమేకమై కొనసాగించిన వారి ఉద్యమ అంకిత భావమే నేటి తెలంగాణ ప్రగతికి కారణమన్నారు. ప్రజల ఆకాంక్షలకు దన్నుగా నిలుస్తూ వారి ఆదరణ పొందేందుకు పార్టీ శ్రేణులు ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు.