మధ్యప్రదేశ్ మద్యం పట్టివేత
154 మద్యం బాటిల్ స్వాధీనం..
రూ. రెండున్నర లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం.
ఆరుగురు వ్యక్తులు అరెస్ట్..
హైదరాబాద్ ,(విజయక్రాంతి): మధ్యప్రదేశ్ నుంచి అక్రమంగా రవాణా చేసినటువంటి 154 మద్యం బాటిల్లను ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. చెంగిచెర్ల ప్రాంతంలో ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చిందని సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఎక్సైజ్ సూపర్డెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో తన బృందాలు తనిఖీలు నిర్వహించాయి. తరుణ్ వర్మ చెంగిచెర్ల కి చెందినటువంటి వ్యక్తి మధ్యప్రదేశ్ నుంచి ఎండిపిఎల్ నాన్ డ్యూటీ పైడ్ లిక్కర్ కింద పెద్ద మొత్తంలో తీసుకువచ్చి పలు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
మొదటగా పట్టుకున్నటువంటి కారులో 40 మద్యం బాటిల్ లను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా తరుణ్ మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చినటువంటి మద్యం బాటీలను 154 స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ లో ఉన్నటువంటి కే. సురేందర్ రెడ్డి కారులో 70 బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు. షేక్ పేటలోని క్రాంతి ఇంట్లో 28 మద్యం పార్టీలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సార్ నగర్ కు చెందినటువంటి నాగార్జున వద్ద 16 బాటిలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం మద్యం కేసులలో రెండు కార్లను ఆరు సెల్ఫోన్లను ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో తరుణ్ వర్మ రవీందర్ గౌడ్ విన్నీ కే సురేందర్ రెడ్డి క్రాంతి నాగరాజు లను అరెస్ట్ చేశారు.






