తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
16-12-2024 03:00 PM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. సభలో విపక్ష సభ్యుల నినాదాల మధ్య శాసనసభ వాయిదా పడింది. సభ మర్యాదలు దెబ్బతీసేలా సభ్యులు వ్యవహరిస్తున్నారని గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ్యుల వద్ద ప్లకార్డులు తీసుకురావాలని స్పీకర్ మార్షల్స్ కు ఆదేశించారు. ప్లకార్డులు మార్షల్స్ కు ఇస్తే మాట్లాడే అవకాశమిస్తామని స్పీకర్ తెలిపారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య సభ స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.






