13-08-2025 01:58:29 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో మంగళవారం నల్లగొండ జిల్లా కోర్టులో తుది తీర్పు వెళ్ళబడుతున్న క్రమంలో భయభ్రాంతులకు గురైన గ్యారాల శివకుమార్ కోర్టు నుండి తప్పించుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి 12 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. జిల్లా గౌరవ మెజిస్ట్రేట్ నిందితుడిని జీవిత ఖైదు విధించినట్లు తీర్పు వెల్లడించింది. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సీఐ రాజశేఖర్ రెడ్డి, వన్ టౌన్ పోలీసు సిబ్బందిని ఎస్పి, డిఎస్ పి అభినందించారు.