13-08-2025 01:48:37 PM
సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ్
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెంలోని బంధం వాగును బుధవారం ఆర్డీవో వేణు మాధవరావు అధికారులతో కలిసి పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. బంధం వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిని పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పంట నష్టం ఉన్నట్లయితే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు తెలియపరచాలని కోరారు. వారి వెంట తహశీల్దార్ దయానందం, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.