13-08-2025 03:16:02 PM
మునగాల,(విజయక్రాంతి): బీజేపీ మండలం పార్టీ అధ్యక్షులు మైలార్ శెట్టి నాగేశ్వర్ రావు అధ్యక్షతన “హర్ ఘర్ తిరంగ్” ర్యాలీ మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుగా బిజెపి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి పాల్గొని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయడం ప్రతి ఒక్కరికి గర్వకారణం అన్నారు.
ఈ పతాకం మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు ప్రతీక. యువత, పిల్లలు, మహిళలు అందరూ దేశభక్తి భావంతో ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మండలంలో ప్రతి గ్రామం, ప్రతి వీధి దేశభక్తి వాతావరణంతో మార్మోగాలని, అందరూ వారి వారి ఇండ్లపై జెండాలు ఎగురవేయడం ద్వారా మన జాతీయ ఐక్యతను మరింత బలపరచాలని ఆమె సూచించారు.
అలాగే ప్రజలు కేవలం కార్యక్రమాల వరకే కాక, దేశ అభివృద్ధిలో తమ పాత్రను చురుకుగా నిర్వహించాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాన్సిల్ మెంబెర్ భద్రంరాజు కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పల్స రమేష్, బిజెపి నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, వెంకటేశ్ బాబు కపిల్ రెడ్డి, రానబోతు శ్రీనివాసరెడ్డి, రెడ్డిపల్లి శృతి, దొంగరి జ్యోతి, తాళ్ల నరేందర్ రెడ్డి, వినోద్, మధు, గుండు ప్రకాష్, మండవ సైదులు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.