calender_icon.png 13 August, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ గురైన రైస్ మిల్ కార్మికుడు మృతి

13-08-2025 03:21:35 PM

వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ నక్కలపల్లి సమీపంలోని భార్గవ్ రైస్ మిల్లులో పనిచేస్తున్న కార్మికుడు నగేష్ నాయక్ (30) విద్యుత్ షాక్ గురై మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపినారు. మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం నగేష్ విద్యుత్ మరమ్మతులు చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందాడని తెలిపారు.

సూర్యాపేట జిల్లాకు చెందిన నగేష్ గత పది సంవత్సరాలుగా రైస్ మిల్లులో పనిచేస్తున్నాడని తెలిపారు. పోలీసులు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రైస్ మిల్ యజమానులు నష్టపరిహారం చెల్లించాలని కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేశారు మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.