12 May, 2026 | 12:24 AM

రేపటితో ముగియనున్న మహా కుంభమేళా

25-02-2025 07:53 PM

ప్రయాగ్ రాజ్,(విజయక్రాంతి): ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా భావిస్తున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela) తుది అంకానికి చేరుకుంది. జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహా కుంభమేళా మహా శివరాత్రి(Maha Shivratri) సందర్భంగా ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా(Prayag Raj Maha Kumbh Mela) రేపటితో ముగియనుండడంతో గంగాస్నానాలు చేసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉత్తర్ ప్రదేశ్ సర్కార్(Uttar Pradesh Government) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. దీంతో యాత్రికుల రాకపోకలు సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం నుంచే ప్రయాగ్ రాజ్ లో వాహనాల రాకపోకలపై యూపీ సర్కార్ ఆంక్షలు అమలు చేసింది.

జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకు 63 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో ముగ్గురికి సమానం. ప్రధాని నరేంద్ర మోదీ సహా రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ మహాసభలో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక మంది విదేశీయులు మహా కుంభమేళాలో పాల్గొని భారత సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించారు. మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఉత్సవంగా భావించబడుతుంది. ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ వేడుక, ఈ సంవత్సరం 144 సంవత్సరాల తరువాత ఘనంగా జరుగుతుంది.