17 July, 2026 | 12:49 AM

ఎల్- నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం

17-07-2026 12:49 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించి, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదు ర్కొనేందుకు ఎల్-నినో కంటింజెన్సీ ప్లాన్--2026 (వానాకాలం)ను రూపొందిచినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నా గేశ్వరరావు తెలిపారు. గురువారం సచివాలయంలో ఎల్-నినో కంటింజెన్సీ ప్లాన్- 2026 ను మంత్రి తుమ్మల విడుదల చేశారు.

   సీ ఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్రిశాట్,  భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ, ఐఐఓఆర్, సిఆర్‌ఐడిఎ, భారత వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖల శాస్త్రవేత్తలు, నిపుణులు కలిసి అత్యంత సమగ్రంగా ఈ కంటింజెన్సీ ప్లాన్‌ను రూపొందించినట్లు తెలిపారు.