మెడికల్ ఏజెన్సీలలో గూబుల్
మహబూబ్ నగర్ : మెడికల్ షాపులలో ఫార్మసిస్టు లేకుండానే మందులు విక్రయాలు జోరుగా చేస్తున్నారని విజయక్రాంతి దినపత్రిక గత రెండు రోజుల క్రితం నిద్రమత్తులో ఔషధ అధికారులను కథనం ప్రత్యేకం చేసింది. ఈ కథనంపై స్పందించిన ఔషధ శాఖ అధికారులు ఉన్నట్టుండి ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు రోడ్ లో ఉన్న సాయి వెంకటేశ్వర షాప్ తో పాటు పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. నేడు దాదాపు 10 మెడికల్ షాపులకు ఫార్మసిస్టులు లేకుండా మందులు విక్రయిస్తున్నారని నోటీసులు జారీ చేయడంతో పాటు గడువు తీరిన మందులను యధావిధిగా కొనసాగిస్తున్నారని గుర్తించిన ఔషధశాఖ అధికారులు వెంటనే సాయి వెంకటేశ్వర మెడికల్ షాపును సీజ్ చేశారు. వాటి విలువ సుమారుగా లక్ష యాభై వేలు ఉంటుంది. ఈ కేసు నివేదికను ప్రిన్సిపల్ జడ్జికి ఔషధ శాఖ అధికారులు అందించారు. ఇక్కడి వరకు ఈ ప్రక్రియ ముగిసిన మెడికల్ ఏజెన్సీల్లో గూగుల్ ఆరంభమైంది.
ముగిసిన సాయి వెంకటేశ్వర మెడికల్ షాప్ కు మెడికల్ ఏజెన్సీల నుంచి మందులు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్న మొదలైంది. ఔషధతనికి అధికారులు షీలా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఏజెన్సీలు ఈ మెడికల్ షాప్ కు మందులు సరఫరా చేయడం జరిగిందో వాటన్నిటికీ నోటీసులు అందించేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఈ మేరకు సరఫరా చేసిన మెడికల్ ఏజెన్సీల యాజమాన్యాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి సంబంధిత మెడికల్ ఏజెన్సీలకు అధికారులు నోటీసులు అందించే అవకాశాలు ఉన్నాయి. మెడికల్ ఏజెన్సీల యాజమాన్యాలు కోర్టు మెట్లు ఎక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.






