calender_icon.png 24 October, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్ప అద్భుతమైన కట్టడం..

22-10-2025 06:18:45 PM

పంజాబ్, యూపీ ఈఆర్సీ చైర్మన్ విశ్వజిత్ ఖన్నా, అరవింద్ కుమార్..

వెంకటాపూర్/రామప్ప (విజయక్రాంతి): మండలంలో గల ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని బుధవారం పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ విశ్వజిత్ ఖన్నా దంపతులు, అరవింద్ కుమార్ దంపతులు సందర్శించారు. ఈ సందర్బంగా వారికి ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమా శంకర్ లు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, శిళ్పకళ ప్రాముఖ్యత, చరిత్ర గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు.

దేవాలయ ప్రాంగణాన్ని పరిశీలించిన వారు రామప్ప దేవాలయ శిల్పకళ, నిర్మాణ శైలి చూసి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం వారు దేవాలయ సౌందర్యాన్ని ప్రశంసిస్తూ, ఇటువంటి ప్రాచీన కళా సంపదను సంరక్షించడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. అలాగే స్థానిక అధికారుల కృషిని కొనియాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ రాక్ భాస్కర్, ఏఎస్ కళ్యాణ్, డిఈ  కన్స్ట్రక్షన్ ఎం ఆర్ టి సదానందం, ఎడిఈ ఆపరేషన్ ములుగు వెణుగోపాల్, వెంకటాపూర్ సబ్‌ ఇంజనీర్ సాంబరాజు, స్థానిక విద్యుత్ సిబ్బందిలు తదితరులు పాల్గొన్నారు.