27 February, 2026 | 5:54 AM

మార్చి 2న మహాధర్నా

27-02-2026 12:12 AM
  1. కుమ్మెర ఘటనపై నిరసనగా ఇందిరా పార్క్ వద్ద నిర్వహణ
  2. బీసీ సంఘాలు, మేధావుల వెల్లడి
  3. బీసీలకు అట్రాసిటీ చట్టం తేవాలి
  4. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాం తి) : కుమ్మెర ఘటనపై నిరసనగా మార్చి 2న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు బీసీ సంఘాలు, మేధావులు వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లోని అశోక హోటల్‌లో నిర్వహించిన సమా వేశంలో వారు మాట్లాడుతూ.. మహాధర్నాకు బీసీలందరూ తరలివచ్చి విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..

బీసీలకు ప్రత్యేక అట్రాసిటీ చట్టం తీసుకురావాలని కోరారు. బీసీలపై అనేక దాడులు జరుగుతున్నాయని, వాటిలో కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయని, మరెన్నో ఘటనలు వెలుగులోకి రావడం లేదని అన్నారు. కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటన సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అక్కడ కనీసం కరెంట్ కూడా లేని పరిస్థితుల్లో ఈ ఘటన జరిగితే, భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో? అని ప్రశ్నించారు.

ఈ తరహా ఘటనలు ఎన్ని రోజులు కొనసాగాలి? దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటి? అనే ఆలోచనల మధ్యనే ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు అట్రాసిటీ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు రక్షణ చట్టంగా ప్రత్యేక బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ చట్టం ద్వారా పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందా చెప్పలేము కానీ, భవిష్యత్తులో ఇ లాంటి ఘటనలు నివారించే అవకాశాలు పెరుగుతాయని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కుమ్మెర జాతర ఘటనలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఒకవేళ బీసీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పటికి నిందితులపై కఠిన చర్యలు తీసుకునేవాళ్లమని,వాళ్ళని ఎ న్కౌంటర్ చేసేవాళ్ళమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, బాధితులకు న్యాయం చేయడంలో విఫలమవు తోందని ఆరోపించారు.

రెడ్లు ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ, బాధి తులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు సరై న ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివర కు ఈ ఘటనపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. చనిపోయింది బీసీ వర్గా ల బిడ్డ కాబట్టే స్పందించడంలేదా? అదే రెడ్డి వర్గానికి చెందిన పిల్లవాడు అయితే పరిస్థితి వేరుగా ఉండేదా? అని ప్రశ్నించారు.

కుమ్మె ర మల్లన్న జాతరలో పసిపాప మరణానికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు. వివిధ పార్టీల్లో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు బీసీ రక్షణ చట్టం కో సం గళం వినిపించాలని పిలుపునిచ్చారు.