కేర్‌లో 250 మోకాలు హిప్ మార్పిడి శస్త్ర చికిత్సలు
హాస్పిటల్‌లో మాకో రోబోటిక్ సిస్టమ్‌తో నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 26(విజయక్రాంతి): హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్ అత్యాధునిక మాకో రోబోటిక్- అసిస్టెడ్ సిస్టమ్ సహాయంతో 250 మోకాలు, హిప్ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సాంకేతికతను ప్రవేశపెట్టిన తక్కువ కాలంలోనే ఈ మైలురాయిని సాధించిన తెలంగాణలో వేగవంతమైన కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. 50 ఏళ్లకు పైబడినవారిలో ఆయుష్షు పెరగడం, కూర్చునే జీవనశైలి, స్థూలకాయం, కదలికలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల మోకాలు, హిప్ ఆర్థ్రైటిస్ సమస్యలు పెరుగుతున్నాయి.
రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా తక్కువ నొప్పి, త్వరితగతిన కోలుకోవడం, దీర్ఘకాలికంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం రోగులకు లభి స్తోంది. మాకో రోబోటిక్-అసిస్టెడ్ సిస్టమ్ ద్వా రా సీటీ స్కాన్ ఆధారంగా ప్రతి రోగికి ప్రత్యేకంగా శస్త్రచికిత్స ప్రణాళిక సిద్ధం చేస్తారు. శస్త్రచికిత్స సమయంలో రియల్ టైమ్ రోబోటిక్ మార్గదర్శకత్వం అందించడంతో ఇం ప్లాంట్‌ను అత్యంత ఖచ్చితంగా అమర్చడం సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన ఎముకలు మరియు చుట్టుపక్కల మృదువైన కం డరాలను సాధ్యమైనంతవరకు కాపాడేలా ఈ సాంకేతికత సహాయపడుతుంది.
సాంప్రదాయ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలతో పోలిస్తే, రోగి త్వరగా నడక ప్రారంభించగలడు. ఆసుపత్రిలో ఉండే రోజులు తగ్గు తాయి. రోజువారీ పనులకు త్వరగా తిరిగి వెళ్లగలడు. డాక్టర్ గొట్టెముక్కల అశోక్ రాజు, క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ మాట్లా డుతూ రోబోటిక్ మోకాలు, హిప్ మార్పిడి శస్త్రచికిత్స జాయింట్ రీప్లేస్‌మెంట్ విధానంలో ఒక పెద్ద మార్పు. ప్రతి రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయడం వల్ల వైద్య నైపుణ్యాన్ని సాంకేతిక ఖచ్చితత్వంతో కలిపి స్థిరమైన ఫలితాలు అందించగలుగుతున్నాం. దీని వల్ల రోగులు త్వరగా సాధారణ జీవనానికి చేరుకుంటున్నారన్నారు.
శరత్ బాబు, సీనియర్ కన్సల్టెం ట్ ఆర్థోపెడిక్స్ మాట్లాడుతూ 250 రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేయడం మా అనుభవం, విశ్వాసానికి నిదర్శనం అన్నారు. డాక్టర్ వాసుదేవ జువ్వాడి, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ మాట్లాడుతూ తక్కువ కాలంలో ఈ మైలురాయి సాధించడం అంటే సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం, అనుభవజ్ఞులైన వై ద్య బృందం కలిసికట్టుగా పనిచేయడం వల్లే సాధ్యమైంది అని అన్నారు. కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌ను 10,000కు పైగా కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల అనుభవం కలిగిన ఆర్థోపెడిక్ బృందం నడిపిస్తోంది.




