05-09-2025 01:20:17 AM
ఎమ్మెల్యే కుంభం
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): మహాలక్ష్మి ధర్మశాలను మోడ్రన్ ధర్మశాలగా మారుస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. 65 సంవత్సరాల క్రితం భువనగిరి పట్టణ వ్యాపారుల సహాయ సహకారా లతో నిర్మాణమై ఎంతోమంది కి నీడనిచ్చి విరాజిలిన మహాలక్ష్మి ధర్మశాల పట్టించుకునే నాధుడు లేక నేడు క్షీణ దశకు చేరు కుంది.
ఇటీవల ధర్మశాల నూతన కార్యవర్గం ఏర్పడిన నేపథ్యంలో చైర్మన్ మంచి కంటి కృష్ణమూర్తి అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోతన ప్రమోద్ కుమార్‌తో కలిసి ధర్మశాలను పరిశీలించారు. ధర్మశాల పూర్వాపరాలను తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వ, దాతల సహాయ సహకారాలతో ధర్మశాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణమూర్తి డైరెక్టర్‌లతో కలిసి మెమోరండాన్ని ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కమిటీ ఘనంగా సన్మానించింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆవేజి చిస్తీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంగా కృష్ణయ్య, వర్తక సంఘం అధ్యక్షులు అనీష్ పూర్ రైమాన్చిస్తి, రాచమల్ల రమేష్ పిట్టల బాలరాజు, ధర్మశాల కమిటీ డైరెక్టర్లు బెలిదే ఆనంద్, సంతోష్, జూలూరు కృష్ణమూర్తి, శ్రీమతి రంగా పద్మ తదితరులు పాల్గొన్నారు.