calender_icon.png 7 September, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలను అభాసుపాలు చేయడం తగదు

05-09-2025 01:17:50 AM

లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియానాయక్ 

కోదాడ, సెప్టెంబర్ 4 : వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా మార్గాన్ని అనుసరిస్తూ విద్యార్థినీలకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్న ‘కిట్స్‘ మహిళా ఇంజనీరింగ్ కళాశాలను అబాసు పాలు చేయడం తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీ నేతగా ప్రధాన భూమిక పోషించిన బట్టు శ్రీహరి కి తగదని లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియానాయక్ స్పష్టం చేశారు.

గురువారం కోదాడలో ఆయన ఎల్ హెచ్ పి ఎస్ నాయకుల తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. బడుగు బలహీన వర్గాల బాలికలకు సాంకేతిక విద్య అందించడంతోపాటు వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థపై ప్రతి విద్యా సంవత్సరం అడ్మిషన్ల సమయంలో కొంతమంది చేస్తున్న కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని బట్టు శ్రీహరి వారికి వత్తాసు పలకడాన్ని వారు ఖండించారు....

కళాశాలకు అన్ని రకాల అనుమతుల తో సజావుగా నడిపిస్తున్న యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. ఈ నెల 1న హైదరాబాదులో ఉన్నత విద్యా మండలి కార్యాల యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆ కళాశాల యాజమాన్యాన్ని అడ్డుకోవడంతో పాటు వారి నుంచి ఫైళ్ళు లాక్కోవడాన్ని ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు.

తప్పుడు విధానాలు మానుకోకపోతే తమ సంఘ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామ న్నారు.  ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బర్మావత్ రాజు నాయక్. జిల్లా అధ్యక్షులు భూక్య రవి నాయక్. ప్రధాన కార్యదర్శి నాగు నాయక్ .నాగరాజు నాయక్ శీను నాయక్ పాల్గొన్నారు.