calender_icon.png 5 September, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన మత్స్యశాఖ అధికారిణి

05-09-2025 01:22:40 AM

రూ.౨౦వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత 

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 4(విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం చరితారెడ్డి గురువారం రూ.౨౦వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.  ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీకి కొత్త సభ్యుల అనుమతుల కోసం ఫిర్యాదుదారుని నుంచి  లంచం డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధితుడి నుంచి రూ.౨౦ వేలు లంచం తీసుకొన్నారు.

విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి  ఆ నగదును స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు.

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.అదేవిధంగా వాట్సప్(9440446106), ఫేస్‌బుక్(తెలంగాణ ఏసీబీ)లో కూడా సమాచారం అందించవచ్చని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుల  వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.