మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారోత్సవంలో దొంగల చేతివాటం
09-12-2024 01:02 AM
* ముంబై పోలీసులకు 13 ఫిర్యాదులు
ముంబై, డిసెంబర్ 8: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజల నుంచి బంగారం, విలువైన వస్తువులు కొట్టేశారు. మహారాష్ట్రలోని దక్షిణ ముంబైలో ఉన్న ఆజాద్ మైదాన్‌లో సీఎం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రామ్‌కు సుమారు 5 వేల మంది హాజరయ్యా రు. ఈ క్రమంలోనే తస్కరులు 13 బంగారు గొలుసులు, రూ.12 లక్షల విలువైన వస్తువులను దొంగిలించా రు. ఇలా పోలీసులకు 13 కంప్లుంట్స్ వచ్చాయి. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.






