కెనడాలో భారత విద్యార్థి హత్య
09-12-2024 01:36 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: కెనడాలో చదువుకుంటున్న భారత విద్యార్థి హర్షన్‌దీప్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఎడ్మాంటన్‌లోని అతడు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోనే శుక్రవారం దుండగులు హర్షన్‌దీప్‌ను కాల్చిచంపారు. హత్యకు పాల్పడిన ముగ్గురిలో రెయిన్, జుడిత్ సాల్టియాక్స్‌లోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన ప్రకారం హర్షన్‌దీప్ సింగ్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన దుండగులు అతన్ని ఫ్లాట్‌లో నుంచి బయటకు లాగి మెట్లమీదకు నెట్టేశారు. తర్వాత వెనుక నుంచి కాల్పులు జరిపారు. సమాచారం అందుకొని అపార్ట్‌మెంట్‌కు చేరుకునే లోపే బాధితుడు రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడని, ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు స్పష్టం చేశారని పోలీసులు వెల్లడించారు.






