15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

నాగిరెడ్డిపేట్‌లో మహాత్మా గాంధీ వర్ధంతి

31-01-2026 12:20 AM

నాగిరెడ్డిపేట్, జనవరి 30 (విజయ క్రాంతి): మహాత్మా గాంధీ సత్యం,అహింసా మార్గంలో చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా  స్ఫూర్తినిచ్చిందని, నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకల్లో మండల మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సత్యం, అహింసా మార్గంలో పోరాటం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును ఇచ్చిందని, భారత ఆర్థిక వ్యవస్థ కోసం ఖాదీ, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కీలక నాయకుడగా సామాజిక కార్యకర్తగా కొనియాడారు.బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరును లేకుండా చేస్తున్నారని ధ్వజం ఎత్తేరు.

అందరూ సత్యం,అహింసతో నేర్చుకోవాలని అదే బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరికి హింస అనేది లేకుండా శాంతితో కూడుకున్న నైతిక విలువలతో ముందుకెళ్లాలని, తెలిపారు. నాగిరెడ్డిపేట మండలం మీదుగా కొనసాగిన జాతీయ రహదారి విస్తరణలో  భాగంగా మహాత్మా గాంధీ గాంధీ విగ్రహాన్ని తొలగించి ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం సిగ్గుచేటని అన్నారు.ఈ కార్యక్రమంలో గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, నాయకులు బాలాజీ,కృష్ణ గౌడ్, మసూద్, సాయిలు తదితరులు ఉన్నారు.